గుండు చేయించుకుంటా.. బిగ్ బాస్ బ్యూటీ అంత పని చేసే సరికి.. అభిమానుల రియాక్షన్

హిందీ ‘బిగ్ బాస్ 7’ విన్నర్ గౌహర్ ఖాన్ మదర్ హుడ్‌ను ఎంజాయ్ చేస్తోంది. జెహాన్‌కు జన్మనిచ్చిన ఆమె.. ఏడు నెలలకే వర్క్ స్టార్ట్ చేయగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Update: 2024-04-09 10:47 GMT

దిశ, సినిమా : హిందీ ‘బిగ్ బాస్ 7’ విన్నర్ గౌహర్ ఖాన్ మదర్ హుడ్‌ను ఎంజాయ్ చేస్తోంది. జెహాన్‌కు జన్మనిచ్చిన ఆమె.. ఏడు నెలలకే వర్క్ స్టార్ట్ చేయగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పీరియడ్‌లో కూడా అభిమానులను సోషల్ మీడియా వేదికగా పలకరిస్తూ Vlogs చేసింది గౌహర్. అయితే లేటెస్ట్ పోస్ట్‌లో జుట్టు కత్తిరించుకునేందుకే డిసైడ్ అయినట్లు చెప్పింది. 

డెలివరీ తర్వాత హెయిర్ చాలా ఊడిపోతుందని.. పాలిపోయిన జుట్టును చూస్తే చిరాకు వస్తుందని చెప్పింది. అయితే పూర్తిగా గుండు చేసుకుంటానని భయపడొద్దని.. నాలుగు ఇంచులు మాత్రమే కట్ చేసుకుంటానని వివరించింది. దీంతో అభిమానులు కాస్తా రిలీఫ్ అయ్యారు. కాగా పోస్ట్‌పార్టమ్ రికవరీలో ఉన్న ఈ బ్యూటిఫుల్ లేడీ..రీసెంట్‌గా ‘ఝలక్ దిఖ్లా జా 11’కు హోస్ట్‌గా వ్యవరిహరించింది.


Similar News