వరుసగా అలాంటి సినిమాలు వస్తే తప్పులేదా.. వరుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’.
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో.. మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
హృతిక్ రోషన్, దీపిక కాంబినేషన్‌లో ‘పైటర్’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో యూనిఫాంలో ఉండి లిప్ కిస్ చేసుకోవడంతో వివాదం అయింది. ఈ సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని.. సేమ్ కాన్సెప్ట్‌తో ఆపరేషన్ వాలంటైన్ వస్తుంది కదా.. మరి వివాదాల సంగతేంటి అనే ప్రశ్న వరుణ్‌కు ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘సాయుధ బలగాలపై సినిమా తీస్తున్నప్పుడు అన్నీ కరెక్టగా ఉండాలి. నిజంగా ఓ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ సినిమా చూసినప్పుడు కూడా తప్పు కనిపించడూడదు. అందుకే చాలా డీటెయిల్స్ తీసుకున్నాం. అంతే కాదు రక్షణ శాఖకు స్క్రిప్ట్ కూడా పంపించాం. వాళ్ల నుంచి కూడా సూచలనలు, సలహాలు తీసుకున్నాం. వైమానిక దళానికి చెందిన గొప్పదనాన్ని రియలిస్టిక్‌గా చూపించాలనేదే మా ప్రయత్నం’ అని తెలిపారు. అలాగే.. వరుసగా సాయుధ బలగాలపై సినిమాలు వస్తున్నాయనే దానిపై స్పందిస్తూ.. ‘వరుసగా ప్రేమకథలు వస్తున్నప్పుడు, సాయుధ బలగాలపై వరుసగా సినిమాలొస్తే తప్పేంటి’ అని సమాధానం ఇచ్చారు. వరుణ్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More..
రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమాలో జాన్వీ కపూర్ కన్ఫామ్.. మాకొద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్