అంబానీ కూతురి ప్రాపర్టీ సొంతం చేసుకునేందుకు హాలీవుడ్ స్టార్స్ కష్టాలు.. ఆస్తులన్నీ అమ్మేసుకున్నా..

ఇండియన్ బిలియనీర్ ముఖేశ్ అంబానీ కూతురు, బిజినెస్ ఉమన్ ఈషా అంబానీ డౌన్ టు ఎర్త్ ఆటిట్యూడ్‌తో ఫుల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది

Update: 2024-04-03 09:18 GMT

దిశ, సినిమా : ఇండియన్ బిలియనీర్ ముఖేశ్ అంబానీ కూతురు, బిజినెస్ ఉమన్ ఈషా అంబానీ డౌన్ టు ఎర్త్ ఆటిట్యూడ్‌తో ఫుల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. వరల్డ్ వైడ్ నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ కలిగి ఉన్న ఆమె సెలబ్రిటీలతోనూ మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంది. బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్ స్టార్స్‌తో ఫ్రెండ్‌షిప్ ఉన్న ఈషా.. రీసెంట్‌గా జెన్నీఫర్ లోపేజ్‌కు తన లాస్ ఏంజిల్స్‌లోని లగ్జరియస్ హౌజ్ అమ్మినట్లు తెలుస్తుంది. దీనికి దాదాపు రూ.500 కోట్లకుపైగా ధర పలికిందని.. లాస్ట్ ఇయర్ జూన్‌లోనే ఈ డీల్ జరిగిందని టాక్. కాగా ఐదేళ్ల ముందున్న మార్కెట్ వాల్యూతో.. అంటే తక్కువ ధరకే సోల్డ్ చేసినట్లు సోషల్ మీడియా టాక్.

ఇక ఈ మాన్షన్‌ను సొంతం చేసుకునేందుకు జెన్నీఫర్‌తోపాటు తన భర్త బెన్ అఫ్లెక్ తమ ఆస్తులు అమ్ముకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెన్ పసిఫిక్ పాలిసేడ్స్‌లోని ఇంటిని రూ. 237కోట్లకు, జెన్నీఫర్ తన బెన్ ఎయిర్ ప్రాపర్టీని రూ. 240 కోట్లకు అమ్మేసిందని ప్రచారం జరుగుతుంది. కాగా ఈషా తన ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో ఇక్కడే తన భర్త ఆనంద్ పరిమళ్‌తో కలిసి గడిపింది. 2022 నవంబర్‌లో ట్విన్స్‌(కృష్ణ, ఆద్య)కు జన్మనిచ్చింది.


Similar News