మహేష్, రామ్ చరణ్ మధ్య అంత స్నేహం ఉందా?.. వాళ్లు అవి కూడా మార్చుకున్నారా!
టాలీవుడ్లో టాప్ హీరోల మధ్య ఉండే బాండింగ్ మనం ఫంక్షన్స్, పార్టీలలో చూస్తూనే ఉంటాం.
దిశ,వెబ్ డెస్క్: టాలీవుడ్లో టాప్ హీరోల మధ్య ఉండే బాండింగ్ మనం ఫంక్షన్స్, పార్టీలలో చూస్తూనే ఉంటాం.ఈ సోషల్ మీడియా వల్లే వారి పర్సనల్ విషయాలు ఎక్కువగా బయటకు వస్తున్నాయి. ఇంట్లో ఏ పార్టీలు జరిగినా, ఏ పండుగ సెలెబ్రేషన్స్ జరిగినా వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నిముషాల్లోనే నెట్టింట్లో హల్చల్ చేస్తూనే ఉంటాయి. ఇక స్టార్ హీరోలు, వారి ఫ్యామిలీల మధ్య ఉండే స్నేహం కూడా ఎక్కువగా వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు మహేష్ బాబు రామ్ చరణ్ ఉన్న క్లోజ్ బాండింగ్ మీద చర్చలు నడుస్తున్నాయి.
ఇక తాజాగా ఆ ఫోటోలను ఫ్యాన్స్ డీ కోడ్ చేయడం మొదలుపెట్టారు. రామ్ చరణ్, మహేష్ బాబు ఫోటోలను కాస్త గమనిస్తే.. వారిద్దరూ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అన్నది అర్థం అవుతోంది. ఆ ఫోటోల్లో ఓ చోట మహేష్ బాబు వేసుకున్న చెప్పులు.. మరో చోట రామ్ చరణ్ వద్ద కనిపిస్తున్నాయి.. ఎవరివి ఎవరు వేసుకున్నారనేది తెలియడం లేదు కానీ.. ఇద్దరూ చెప్పులు మార్చుకునేంత క్లోజ్ ఫ్రెండ్సా? అని అందరూ ఆశ్చర్యపోతోన్నారు.