సెలబ్రిటీల ఇంట్లో పని మనుషులకు సపరేట్ భోజనం ఉంటుందా.. రామ్ చరణ్-కరీనా కపూర్ ఇంట్లో ఎలాంటి పద్ధతి ఉంది?
చాలా మంది ఇళ్లల్లో పని మనుషులు సరిగా పనిచేయడం లేదని, వారిపై చికాకు పడటం, తరచూ ఏదో ఒక మాట అనడం లాంటివి చేస్తుంటారు.
దిశ, సినిమా: చాలా మంది ఇళ్లల్లో పని మనుషులు సరిగా పనిచేయడం లేదని, వారిపై చికాకు పడటం, తరచూ ఏదో ఒక మాట అనడం లాంటివి చేస్తుంటారు. పైగా జీతాలు కూడా సరిగా ఇవ్వరు. శాలరీలు ఇవ్వకపోగా అదనపు పని భారం కూడా వేసే వారుంటారు. కానీ కొంతమంది ఇంట్లో పనిమనుషులు ఇంట్లో మనుషుల్లాగే ఉంటారు. యజమానులు కూడా ఇంట్లో మనిషిలాగే ట్రీట్ చేస్తారు. తాము తినే భోజనమే వారికి పెడతారు. ఒక్కోసారి పని మనుషులతో పాటు తింటారు కూడా. అయితే బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఇంట్లో పనిమనిషి గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించడం మొదలుపెట్టారు. సెలబ్రిటీ ఆయా లలితా డిసిల్వా ఆయాగా నెలకు రూ. 2. 5 లక్షల జీతం అందుకుంటుందని నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఈమె కేవలం కరీనా కపూర్ పాపకే కాదు..
టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఉపాసన గారాల పట్టి క్లింకారకు కూడా సేవకురాలే. అయితే లలితా డిసిల్వా ఓ ఇంటర్వ్యూకు హాజరై కరీనా కపూర్ ఫ్యామిలీ, రామ్ చరణ్ ఫ్యామిలీ ఎప్పుడూ తనను బయటి వ్యక్తిగా చూడలేదని చెప్పుకొచ్చింది. ఇంట్లో మనిషిలాగే చూస్తారని, వారు తినేవే లతితాకు పెడతారని, పనిమనుషులకు సపరేట్‌గా వేరే భోజనం ఏం ఉండవు అని ఇంటర్వ్యూలో తెలిపింది. ముఖ్యంగా కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది. చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడప్పుడు వారితోనే కలిసి డైనింగ్ టేబుల్ పైనే కూర్చుని భోజనం చేస్తానని వెల్లడించింది. సైఫ్ కూకింగ్ చాలా బాగా చేస్తాడని, లాల్ మాస్‌ను అద్భుతంగా తయారు చేస్తాడని, స్పఘెట్టి, పాస్తా, ఇతర ఇటాలియన్ వంటకాలు చేయడంతో ఆయన ఎక్ఫర్ట్ అని లలితా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.