శర్వానంద్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఆమేనా?
యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది జనవరిలో తాను ప్రేమించిన రక్షిత రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక త్వరలోనే శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ
దిశ, వెబ్డెస్క్ : యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది జనవరిలో తాను ప్రేమించిన రక్షిత రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక త్వరలోనే శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ తన అభిమానులు ఎంతో సంబర పడ్డారు. కానీ వీరు ఎంగేజ్మెంట్ చేసుకొని నాలుగు నెలలు కావస్తున్నా,పెళ్లిపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కాగా, కొందు వీరు వీరు బ్రేకప్ తీసుకున్నారంటూ అనేక రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ నిజానికి ప్రస్తుతం శర్వానంద్ ఓ సినిమా షూటింగ్లో ఉన్నారని, ఈ మధ్యలోనే లండన్లో షూటింగ్ కంప్లీట్ చేశారని, త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకుంటారని క్లారిటీ ఇచ్చారు.
అయితే శర్వానంద్ పెళ్లి ఎప్పుడో జరగాల్సిందేనంట. కానీ శర్వానంద్ సోదరి ఫారిన్ లో ఉండడం వల్ల ఆమె పెళ్లికి రావడానికి టైం కుదరడం లేదంట.దీంతో తన సోదరి రాకుండా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక శర్వానంద్ తన పెళ్లి ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది.
Read More: శర్వానంద్ పెళ్లి డేట్ ఫిక్స్?