Samantha : ఆ విషయంలో సమంతను ఇంకా వేధిస్తున్న నాగచైతన్య?

అక్కినేని హీరో నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు అన్యోన్యంగా ఉన్న ఈ జంట తర్వాత విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి తమ అభిమానులకు షాకిచ్చారు.

Update: 2023-03-01 07:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ :  అక్కినేని హీరో నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు అన్యోన్యంగా ఉన్న ఈ జంట తర్వాత విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి తమ అభిమానులకు షాకిచ్చారు.

అయితే సమంత, నాగచైతన్య ఎందుకు విడిపోయారో, ఇప్పటికీ ఎవరికీ కరెక్ట్ రీజన్ తెలియదు. దీంతో చాలా రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతం మరో రూమర్ తెరపైకి వచ్చింది. అది ఏమిటంటే? వీరిద్దరు కలిసి నటించిన సినిమా ఏమాయ చేసావే, ఇది 13 సంవత్సాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నాగచైతన్య సమంతతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు. కానీ సమంత మాత్రం చైతూ ఫొటోలు షేర్ చేయడం లేదు.

కాగా, ఇటీవల సమంత ఓపోస్ట్ చేసింది.. అందులో ఇలా రాసుకొచ్చింది. గడచినన్ని రోజులు నేను ముందుకు అడుగులు వేసాను అంటే దానికి కారణం మీ ప్రేమ అభిమానమే. మీ ప్రేమాభిమానం నాపై ఉండడం వల్లే నేను ఇంత ఎత్తుకి ఎదగలిగాను. నన్ను ప్రతిసారి ఇబ్బంది పెట్టే విషయాలు ఇకపై నన్ను ఏమీ చేయలేవు. మీ ప్రేమాభిమానాలు నాపై ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. అంటూ పోస్టు చేసింది. అయితే నాగచైతన్య తన ఫొటో పోస్టు చేయడం సమంతను బాధిస్తుందేమో అందుకే అలా పోస్టు చేసిందంటూ రాసుకొచ్చింది అంటూ తమ అభిమానులు గుసగుసలాడుతున్నారు.

Read more:

చై, సామ్ విడాకులు.. రెండేళ్ల తర్వాత బయటపడిన అసలు రహస్యం

Tags:    

Similar News