నా ఇంట్లో రాగద్వేషాలు, డోర్లను బద్దలు కొట్టడం, ఎన్నో కష్టాలంటూ అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. కారణం అదేనా?

బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇంకా కొన్ని సెట్స్ మీద ఉన్నవి కూడా ఉన్నాయి.

Update: 2024-06-12 11:57 GMT

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇంకా కొన్ని సెట్స్ మీద ఉన్నవి కూడా ఉన్నాయి. తొందరలో పుష్ప-2 మూవీతో అభిమానులను మెప్పించనుంది. అయితే ఇన్నాళ్లుగా బుల్లితెరకు దూరం అయిన అనసూయ ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు సినిమాల్లో నటిస్తూనే షోస్‌లోనూ పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులు షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, అనసూయ ఓ ఇంట్రెస్టింగ్ కొటేషన్ పెట్టింది. ‘‘నా ఇంట్లో రాగద్వేషాలు, కోపతాపాలు ఉండవు.

అలాగే డోర్లు బద్దలు కొట్టడం గానీ గ్లాసులను విసిరి పగలగొట్టడం కానీ ఉండవు. బాడీ షేమింగ్‌లు గానీ, అసభ్యకరంగా మాట్లాడటం కానీ పిలవడం, బ్లాక్ మెయిల్ చేయడం వంటివి ఉండవు. నా ఇల్లు ఎంతో సున్నితంగా ఉంటుంది. చాలా మంది ప్రదేశం.. నా వాళ్లను సురక్షితంగా ఉంచగలిగే ఇళ్లు. భయాలు కానీ బాధలు ఉండవు. నేను ఎన్నో కష్టాలు పడి వచ్చి ఉండవచ్చు. కానీ నా ఫ్యామిలీకి మాత్రం సురక్షితమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసి ఇచ్చాను’’ అని రాసి ఉన్న కొటేషన్ షేర్ చేసింది. అంతేకాకుండా లవ్ సింబల్, దండం పెడుతున్న ఎమోజీని కూడా పెట్టింది. ప్రస్తుతం అనసూయ పెట్టిన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఈ కొటేషన్‌ను ఇప్పుడే ఎందుకు షేర్ చేసిందని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆమె ఫ్యాన్స్ మాత్రం అనసూయకు బాగా సెట్ అవుతుందని ఈ కొటేషన్ షేర్ చేసింది కావొచ్చని అంటున్నారు.

 


Similar News