పెళ్లి చూపుల్లో అనుకోకుండా ఒకే ప్రశ్న అడిగిన RRR హీరోల భార్యలు!

ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న జూనీయర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

Update: 2023-11-07 12:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న జూనీయర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సినిమాతో ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఏర్పడిన ఫ్రెడ్షిప్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతకుముందు కూడా ఈ హీరోలు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్ళు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వీరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. తారక్, చరణ్ ఫ్రెండ్స్ అన్న విషయం కూడా అప్పుడే నెటిజన్లకు తెలిసింది. ఇదంతా పక్కన పెడితే వీళ్ళిద్దరి జీవితంలో అనుకోకుండా ఒకే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందట. ఇక రామ్ చరణ్ - ఉపాసన ప్రేమ వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రణితలది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయినా కానీ వీళ్ళిద్దరూ భార్య విషయంలో ఒకటే సిట్యువేషన్ ఫేస్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

రామ్ చరణ్ ఉపాసనలు ప్రేమలో ఉన్నప్పుడు.. ఉపాసన చరణ్‌ను ఓ టిపికల్ అండ్ లేడీస్ అందరూ అడిగే క్వశ్చన్ అడిగిందట. ‘‘పెళ్లి తర్వాత మీరు ఎవరికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు? నేనా? మీ అమ్మనా? అని సరదాగా అడిగిందట. కామన్‌గా ఈ ప్రశ్నను ఆడవాళ్లందరూ తమ కాబోయే భర్తను అడుగుతుంటారు. అయితే సేమ్ ఇలాగే పెళ్లి చూపుల్లో ఎన్టీఆర్‌కు లక్ష్మీ ప్రణతి ఈ ప్రశ్న వేసిందట. ఆ స్టార్ హీరోస్ కూడా ఆచితూచి కరెక్ట్‌గానే సమాధానం ఇచ్చారు. ‘‘ఇద్దరికి ప్రాధాన్యత ఇస్తాను. అమ్మను బాగా చూసుకునే ప్రతి అబ్బాయి తన భార్యను కూడా బాగానే చూసుకుంటారు’’. అని సేఫ్ ఆన్సర్ ఇచ్చి బయట పడ్డారట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News