Iman Esmail: పాకిస్థానీ రీల్ గర్ల్.. ప్రభాస్ హీరోయిన్ అయిపోయిందిగా.. వైరల్ అవుతున్న వీడియోలు...

పాకిస్థానీ గర్ల్ ఒక్కరోజులోనే ఇండియన్ క్రష్ అయిపోయింది. ముఖ్యంగా తెలుగు ప్రజల ఫేవరేట్ గా మారిపోయింది. ఇంతకీ ఎవరని అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ మీరు ఊహించిన అమ్మాయే.. ఇమాన్ ఇస్మాయిల్. ఇప్పటికే ఇన్ ఫ్లూయెన్సర్ గా భారీ మొత్తంలో ఫాలోవర్స్ ను

Update: 2024-08-17 17:45 GMT

దిశ, సినిమా : పాకిస్థానీ గర్ల్ ఒక్కరోజులోనే ఇండియన్ క్రష్ అయిపోయింది. ముఖ్యంగా తెలుగు ప్రజల ఫేవరేట్ గా మారిపోయింది. ఇంతకీ ఎవరని అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ మీరు ఊహించిన అమ్మాయే.. ఇమాన్ ఇస్మాయిల్. ఇప్పటికే ఇన్ ఫ్లూయెన్సర్ గా భారీ మొత్తంలో ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న అమ్మాయి.. ఈరోజు హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. అది కూడా ప్రభాస్ సరసన కావడమే ఆమె వైరల్ అయ్యేందుకు కారణం. కాగా హను రాఘవూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ 'ఫౌజీ'గా ప్రకటించిన మేకర్స్.. ఇందులో రెబల్ స్టార్ సైనికుడిగా కనిపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు.

ఇక ఇదిలా ఉంటే ఇమాన్ ప్రజెంట్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తను డ్యాన్స్ చేస్తున్న రీల్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఆమె గ్రేస్, ఎక్స్ ప్రెషన్స్ కు పడిపోతున్న కుర్రాళ్ళు.. లేటెస్ట్ క్రష్ లిస్ట్ లో చేర్చేశారు. హీరోయిన్లు అందరూ తన ముందు దిగదుడుపే అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే ఆమెను సోషల్ మీడియాలో ఫాలో కావడం మొదలుపెట్టడంతో ఫాలోవర్స్ సంఖ్య గంటల్లోనే వేలల్లో పెరిగిపోయినట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News