పుట్టబోయేది అమ్మాయి అంటూ పోస్ట్‌తో హింట్ ఇచ్చిన ఇలియానా..
గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా రాణించింది.
దిశ, వెబ్ డెస్క్: గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా రాణించింది. కెరియర్లో దూసుకుపోతున్న సమయంలోనే తప్పుడు నిర్ణయాలు తీసుకొని కెరియర్ను నాశనం చేసుకుంది. టాలీవుడ్ లో వస్తున్న అవకాశాలను కాలదుకుని బాలీవుడ్‌కు వెళ్లింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఇటీవల తాను ప్రెగ్నెంట్ అంటూ అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆమె ప్రకటించిన వెంటనే ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం అలా చేసిందని అందరూ అనుకున్నారు.
కానీ బేబీ బంప్ చూపిస్తూ మరికొన్ని ఫొటోలు షేర్ చేయడంతో నిజంగా ఇలియానా ప్రెగ్నెంట్ అయ్యిందని తెలుసుకున్నారు. ఈ బ్యూటీ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది. తాజాగా, బేబీ బంప్ ఫొటోలతో తనకు పుట్టబోయేది పాప అని చెప్పేసింది. మిర్రర్ సెల్ఫీ ఫొటోలను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ ‘ఏంజెల్స్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఇలియానాకు పుట్టబోయేది అమ్మాయి అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో ఇలియానా, కత్రినా సోదరుడి సెభాష్టియన్తో సహజీవనం చేస్తుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read: ఎంత సమ్మర్ అయితే మాత్రం ప్యాంట్ లేకుండా అంతా చూపించాలా?