ఎట్టకేలకు ప్రియుడి ఫొటో రివిల్ చేసిన ఇలియానా!
నటి ఇలియానా ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీని చాలా ఎంజాయ్ చేస్తోంది.
దిశ, సినిమా: నటి ఇలియానా ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీని చాలా ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి కాకుండానే ఇలియానా తల్లి కాబోతుండటంతో పుట్టబోయే బిడ్డ తండ్రి ఎవరు అంటూ జనాలు జుట్టు పీక్కుంటున్నారు. అయితే ఎట్టకేలకు తన ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది ఇలియానా. బ్లాక్ అండ్ వైట్లో ఇద్దరు ముద్దు పెట్టుకున్నట్లు ఉన్న పిక్ షేర్ చేస్తూ.. ‘గర్భధారణ అనేది ఒక అందమైన వరం. ఈ క్షణాన్ని అనుభవించడం నా అదృష్టం. ఒక ప్రాణానికి జన్మనిచ్చిన అనుభవం ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో నేను చెప్పలేను. చివరగా నేను అంత కోల్పోయాను అనుకున్న టైంలో నా చెయ్యి పట్టుకున్నావు. కన్నీళ్లు తుడిచావు. నన్ను నవ్వించడానికి ప్రయత్నం చేశావు. నాకు కావాల్సింది కూడా నీ నుండి ఒక కౌగిలింత మాత్రమే’ అంటూ తన ప్రియుడి గురించి చెప్పుకొచ్చింది.
Also Read: వరుణ్ తేజ్.. లావణ్యకు తొడిగిన రింగ్ ఖరీదెంతో తెలుసా?