నన్ను ట్రోల్ చేస్తే చేయండి.. కానీ ఆమెను అవమానించకండి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్

బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-07-15 13:35 GMT

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుని.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో కీలక పాత్రలు చేసి.. నటిగా సత్తా చాటింది. ప్రస్తుతం అనసూయ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టి్వ్‌గా ఉంటూ.. తనను ట్రోల్ చేస్తున్న వారిపై ఫైర్ అవుతోంది.

తాజాగా, ఓ నెటిజన్ అనసూయ, హీరోయిన్ సావిత్రి పాటకు బుల్లితెర షోలో వేసిన డాన్స్‌ వీడియోపై ట్రోల్ చేశాడు. దీనిపై ఆ హాట్ యాంకర్ రియాక్ట్ అవుతూ ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేస్తూ కౌంటర్ వేసింది. ‘‘హలో తేజు! మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను!! నా శాంతి కోసం నేను దేనికీ స్పందించకూడదని నిర్ణయించుకున్నాను.. కానీ 4 సంవత్సరాల క్రితం ఒక ఛానెల్‌లో జరిగిన ఒక పండుగ కార్యక్రమానికి మహానటి సావిత్రమ్మకు నివాళులు అర్పించిన నా ప్రదర్శనను నేను చూస్తున్నాను. కానీ నెట్టింట చాలా అవమానకరమైన రీతిలో ట్రోల్ చేస్తున్నారు.

నేను న్యాయమైన, గౌరవప్రదమైన విమర్శలకు సిద్ధంగా ఉన్నాను. కానీ మహానటి సావిత్రమ్మ నివాళిని ఉద్దేశించి ఇలా అగౌరవ పరచడం బాలేదు. దయచేసి మొత్తం ప్రదర్శనను చూసి ఆపై జడ్జ్ చేయమని నేను సూచిస్తున్నాను. మీరు నిజంగా తీర్పు చెప్పగలరనుకుంటే.. ఇది Zee5 ప్లాట్‌ఫారమ్‌లో బాబుగారి ఇంట్లో బుట్టభోజనం అనే కార్యక్రమం అందుబాటులో ఉంది. మీకు నా నటన నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు.. కానీ మీరు చేయగలిగినది కనీసం దానిని చూపించడంలో డీసెంట్‌గా ఉండటమే. కనీసం లెజెండ్ కోసమైనా.. దయచేసి చూడండి. ఎప్పటిలాగే నన్ను విమర్శించాలనుకుంటే అలాగే చేయండి’’ అని రాసుకొచ్చింది.


Similar News