కల్కి మూవీలో కృష్ణుడి పాత్ర చేసిందెవరో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి '2898 AD ' ఎన్నో అంచనాలతో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది
దిశ, సినిమా : నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి '2898 AD ' ఎన్నో అంచనాలతో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సెన్సేషన్ క్రియోట్ చేసింది. ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ అందుకుని బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ మూవీలో ప్రభాస్, అమితాబ్ నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్, వీఎఫ్‌ఎక్స్, నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
ఈ సినిమాలో ముఖ్యంగా క్లైమాక్స్‌లో ప్రభాస్‌కి వచ్చే ఎలివేషన్ మరో లెవెల్‌లో ఉంది. అయితే, ఇప్పుడు కల్కి సినిమాలో ఒక పాత్ర గురించే అందరూ చర్చించుకుంటున్నారు. అదే కృష్ణుడి పాత్ర గురించి.. ! కన్నయ్య పాత్రలో ఎవరు నటించారని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. తాజాగా ఈ పాత్రలో ఎవరు నటించారనే దానిపై క్లారిటీ వచ్చింది.
కోలీవుడ్ యంగ్ హీరో కృష్ణ కుమార్ కల్కి చిత్రంలో కృష్ణుడిగా కనిపించినట్లు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. కృష్ణుడి పాత్రపై సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తూ ఆయన పాత్రపై క్లారిటీ ఇస్తూ, ఇంత గొప్ప పాత్రలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇతను తమిళంలో బాగా పాపులర్ అయిన నటుడు. ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిన నటుడు. ఈ మూవీలో కృష్ణుడిగా ముఖం కనిపించకుండా తన బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా నటించాడు.