మెగాస్టారా మజాకా.. ఆయన పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం ఉంది.
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా కుర్ర హీరోలతో పోటీగా మూవీస్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు చిరంజీవి. తన అందానికి, స్టైల్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మేరకు ఏ ఈవెంట్‌కు వెళ్లిన కూడా మెగాస్టార్ లుక్‌పై నెటిజన్లు కళ్లు పడుతూనే ఉంటాయి. ఆయన ఏ సూట్ వేసుకున్నారు.. ఏ వస్తువులు ధరించారు అని ఫోకస్ పెడతారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న చిరంజీవి చేతి వాచ్ గురించి ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. అదేంటంటే..
తాజాగా హైదరాబాద్‌లో సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెగాస్టార్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ క్రమంలోనే చిరు పెట్టుకొచ్చిన వాచ్ అందరి దృష్టిని ఆకర్శించింది. దీంతో ఆ వాచ్ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. అయితే.. ఆ వాచ్ రోలేక్స్ కంపెనీకి చెందినదన్న మాట. కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ అనే పేరుతో పిలవబడే ఈ వాచ్ ధర దాదాపు రూ. 1.90 కోట్లు వరకూ ఉంటుందని అంచనా. దీంతో వాచ్ ధర తెలుసుకున్న వారు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వాచ్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Read More : నెట్టింట వైరల్‌గా మారిన పవన్ కల్యాణ్ కూతురు ఆద్య చిన్నప్పటి వీడియో