Kiara Advani : కియారా అద్వానీ పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రజంట్ వరుస పాన్ ఇండియా చిత్రలతో దూసుకుపోతుంది.

Update: 2024-03-06 05:40 GMT

 దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రజంట్ వరుస పాన్ ఇండియా చిత్రలతో దూసుకుపోతుంది. పెళ్లయ్యాక కూడా ఈ అందాల తార క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రామ్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ లో నటింస్తుండగా.. దీంతో పాటుగా ‘వార్ 2’లో కూడా హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. అలాగే తాజాగా ‘డాన్ 3’ చిత్రంలో కూడా కియారా అద్వానీ కథానాయికగా ఎంపికైంది . ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రణవీర్ సింగ్ హీరోగా నటించనున్నాడు. అయితే ఈ సినిమా హీరోయిన్ ఎంపిక విషయంలో నటుడు రణవీర్ సింగ్, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ మధ్య కొన్ని విభేదాలు వచ్చినట్లు సమాచారం. ఎందుకంటే ఈ మూవీలో హీరోయిన్‌గా కృతి సనన్ ఇంకా కియారా అద్వానీ లో ఎవరినో ఒకరిని ఎంచుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అయితే రణ్ వీర్ సింగ్ మాత్రం కియారా అద్వానీకి అనుకూలంగా ఓటు వేశాడట అలా కియారా ఓకే అయ్యింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ‘డాన్ 3’ మూవీ కోసం కియారా పారితోషికం వింటే చుక్కలు చూడాల్సిందే. ముంబై వర్గాల ప్రకారం ఈ సినిమా కోసం కియారా అద్వానీ రూ.13 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. తన కెరీర్ లోనే ఇది అత్యధిక పారితోషికం అని చెప్పాలి. దీని బట్టి చూస్తే ‘డాన్ 3’ సినిమా ఆమెకు చాలా స్పెషల్‌గా ఉండనున్లుగా తెలుస్తోంది. ఇక ‘వార్ 2’ చిత్రం కోసం సుమారు రూ. 6 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి మంచి ఫామ్ లో కియారా దూసుకుపోతుంది కియారా.

Read More..

జ్వరం వచ్చినా పొట్టకూటి కోసం ఇలాంటి పనులు తప్పడం లేదు.. విష్ణు ప్రియ ఇంట్రెస్టింగ్ పోస్ట్  


Full View
Tags:    

Similar News