ఎట్టి పరిస్థితుల్లో నరేష్‌తో విడాకులకు ఒప్పుకోను: Ramya

నటుడు నరేష్ చేసిన ఆరోపణలపై అతడి భార్య రమ్యరఘుపతి స్పందించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. నటి పవిత్ర కోసం నరేష్ తనకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారని అన్నారు.

Update: 2023-01-28 06:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: నటుడు నరేష్ చేసిన ఆరోపణలపై అతడి భార్య రమ్యరఘుపతి స్పందించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. నటి పవిత్ర కోసం నరేష్ తనకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారని అన్నారు. నరేష్‌ను హత్య చేయించాలని తాను ప్లాన్ చేశానని అతడు చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. ఆస్తుల గురించి తాను పోరాడటం లేదని.. ఆస్తులే కావాలనుకుంటే ఎప్పుడో విడాకులు ఇచ్చేదాన్ని అని చెప్పారు. నరేష్‌లో మార్పు వస్తుందని ఎదురు చూస్తానని.. న్యాయం జరిగే వరకు పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు. నరేష్‌తో విడాకులకు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోనని రమ్య తేల్చి చెప్పారు.

కోర్టులో కేసులు పెట్టి తనను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నరేష్ తనపై చేసిన ఏ ఆరోపణలకు కూడా అతడి వద్ద ఆధారాల్లేవని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, రమ్య డబ్బు కోసం తనను మోసం చేసిందని.. సుపారీ కిల్లర్స్‌తో తనను హత్య చేయించేందుకు ప్లాన్ చేసిందని నరేష్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆమె ఓ కాంగ్రెస్ మాజీ మంత్రితో సైతం ఫోన్ చేయించి తనను బెదిరింపులకు గురి చేసిందని తెలిపాడు. తన కుటుంబ సభ్యులు 10 కోట్లు కొట్టేసిందని ఆరోపించారు. 

Also Read...

బాలయ్యతో Kajal Aggarwal కన్ఫర్మ్ 

చెల్లి పెళ్లికి న్యూడ్ డ్యాన్సర్లను రప్పించి పరువు తీసింది: భార్యపై నరేష్ ఆరోపణలు

Tags:    

Similar News