ఇకపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్

యంగ్ హీరో కార్తికేయ తాజా సినిమా ‘భజే వాయు వేగం’.

Update: 2024-06-01 13:44 GMT

దిశ, సినిమా: యంగ్ హీరో కార్తికేయ తాజా సినిమా ‘భజే వాయు వేగం’. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించగా.. ‘హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రలో అలరించాడు. ఫుల్ యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ & లవ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. సక్సెస్ వైపు అడుగులువేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని యూవీ ఆఫీస్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘భజే వాయు వేగం’ సినిమాకు అందరి దగ్గర పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సాధారణంగా సినిమా ఎంత బాగున్నప్పటికీ.. ఎక్కడో ఒక దగ్గర ఫలానా ఎలిమెంట్ బాగుందనో, బాగోలేదనో చెప్తారు. కానీ మా మూవీ చూసినవాళ్లు చాలా బాగా నచ్చింది అంటున్నారు. ఈ రేంజ్‌లో మా మూవీ ప్రేక్షకుల మెప్పు పొందడం చాలా సంతోషంగా ఉంది. ‘RX100’ కంటే ఎక్కువ ఎమోషన్ ఈ సినిమాలో వర్కవుట్ అయ్యింది. మేము కథను నమ్మి ఎలాంటి మూవీ చేయాలనుకున్నామో, అలాంటి మూవీ చేశాం. సక్సెస్ కూడా మేము ఆశించినట్లే దక్కింది. ఈ చిత్రం ఇచ్చిన సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకుని తర్వాత మూవీ వైపు అడుగులు వేస్తాను. ప్రేక్షకులు నాకు ఇచ్చిన ప్రేమ, ఆదరణను, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు. 


Similar News