అలాంటి అనుభవాలు నాక్కూడా ఎదురయ్యాయి.. అను ఇమ్మానియేల్ షాకింగ్ కామెంట్స్

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికీ చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఓపెన్ అయిన విషయం తెలిసిందే.

Update: 2023-08-28 04:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికీ చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అను ఇమ్మానియేల్ కాప్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరో నాని ‘మజ్ను’ సినిమాతో అను తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.అనంతరం పవన్ కల్యాణ్‌కు జంటగా అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి భారీ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హీరో కార్తీక్‌కి జంటగా జపాన్ చిత్రంలో అను ఇమ్మానియేల్ నటిస్తుంది. జపాన్ సెప్టెంబర్ 30న విడుదల కానుంది.

ఈ క్రమంలో అను ఇమ్మానియేల్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడింది. ‘‘చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. పడక సుఖం కోసం నన్ను కొందరు ఇబ్బంది పెట్టారు. కానీ, నేను వారికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తెలివిగా తప్పించుకున్నాను. ఈ సమస్యను కుటుంబ సభ్యుల సహకారంతో మనం ఎదుర్కోవాలి. ఇలాంటి ఒత్తిడికి గురైనప్పుడు కుటుంబ సభ్యులతో చెప్పాలి. వాళ్ళ అండ తీసుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అల్లు శిరీష్‌తో ప్రేమ వ్యవహారంపై స్పందిస్తూ.. ఆ వార్తలు నా వరకు వచ్చాయి. మా అమ్మ గారు నాతో చెప్పారు. ఆమె న్యూస్ ఎక్కువగా ఫాలో అవుతారు. ఇలా వార్తలు వస్తున్నాయని అమ్మ చెప్పి బాధపడింది. నిజానికి ఊర్వశివో రాక్షసివో చిత్రానికి ముందు శిరీష్ ని కలిసిందే లేదు. ఆ చిత్ర పూజా సెరిమోని రోజు పరిచయమయ్యారు’’ అని తెలిపింది. ప్రస్తుతం అను ఇమ్మానియేల్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read:   నేడు సీనియర్ హీరో సుమన్ పుట్టిన రోజు

Tags:    

Similar News