Mrunal Thakur: నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా.. నువ్వే నా సోల్‌మేట్ అంటూ మృణాల్ ఎమోషనల్ పోస్ట్
బుల్లితెర సీరియల్ నటి మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
దిశ, సినిమా: బుల్లితెర సీరియల్ నటి మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే ఈ అమ్మడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు తన అందం, అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. అంతేకాకుండా ఫుల్ క్రేజ్ తెచ్చుకుని ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. తాజాగా, మృణాల్ తన అక్క లోచన్ పుట్టిన రోజు కావడంతో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
‘‘ఈ రోజు నా సిస్టర్, మేకప్ ఆర్టిస్ట్, నా సోల్‌మేట్ పుట్టిన రోజు. నన్ను మీరాబాయిగా, చిన్ని కృష్ణుడిగా, రాజస్తానీ డ్యాన్సర్‌గా ఎప్పుడూ ఏదో ఒక గెటప్‌లో రెడీ చేస్తూ వచ్చావు. సూపర్ 30, హాయ్ నాన్న చిత్రాల్లోనూ మ్యూజిక్ సృష్టించావు. నీ క్రియేటివిటీకి, ఓపికకు, ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నువ్వు లేకుండా నేను ఏం చేయగలను.
నా సోదరివి మాత్రమే కాదు సోల్‌మేట్‌వి కూడా.. నాకు అండగా నిలబడినందుకు థాంక్యూ. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మేకప్‌ను నీ వృత్తిగా ఎంచుకున్నావు. దీని ద్వారా ఎంతోమంది కళ్ళలో ఆనందాన్ని నింపుతున్నావు. ఇంతకంటే గర్వకారణం ఇంకేముంటుంది. నాకు ఎప్పటికీ టీ టైమ్‌లో తోడుగా మారిన అందమైన ముత్యాల హారానికి ధన్యవాదాలు!’’ అని రాసుకొచ్చింది.