నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యడమే ఇష్టం.. యంగ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
యంగ్ హీరోయన్ ఐశ్వర్య మీనన్ ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
దిశ, సినిమా: యంగ్ హీరోయన్ ఐశ్వర్య మీనన్ ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘ఖిలాడీ, స్పై’ వంటి మూవీస్‌లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ప్రజెంట్ ఈ బ్యూటీ ‘భజే వాయు వేగం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో కార్తికేయ హీరోగా నటించగా.. రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవి శంకర్, శరత్ లోహితస్వా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ మే 31న విడుదలకు సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన హీరోయిన్ ఐశ్వర్య మీనన్ సినిమా గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.
‘ఈ సినిమాలో నేను ఇందు అనే క్యారెక్టర్లో కనిపిస్తాను. ఇది కమర్షియల్ సినిమా అయినప్పటికీ నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో యాక్షన్, ఎమోషన్స్, లవ్ అన్ని ఆకట్టుకుంటాయి. నాకు ఇలాంటి సబ్జెక్ట్స్ చేయడం ఇష్టం. పైగా యూవీ లాంటి పెద్ద బ్యానర్ నిర్మించడంతో ఆఫర్ వచ్చిన వెంటనే ఓకే చెప్పేశాను. ఇందులో నేను మొత్తం ట్రెడిషనల్ లుక్‌లోనే కనిపిస్తాను. నిజంగా అలా ఇలాంటి క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను రియల్ లైఫ్‌లో కూడా చీర కట్టుకోవడానికి, ట్రెడిషనల్‌గా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాను. ‘స్పై’ సినిమాలో కాస్త మోడ్రన్‌గా కనిపించాను. కానీ ‘భజే వాయు వేగం’ సినిమాలో నా పాత్ర ‘స్పై’ మూవీలోని క్యారెక్టర్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య మీనన్.