Mrunal Thakur: డేంజర్ అని తెలిసింది.. ఇక నుంచి జాగ్రత్త పడతాను: మృణాల్

యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటన, అందం, అభినయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

Update: 2024-09-27 09:23 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటన, అందం, అభినయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. మొదటి మూవీతోనే మృణాల్ ఫుల్ క్రేజ్ సంపాదించుకోవడంతో పాటు వరుస ఆఫర్లు సొంతం చేసుకుంది. నేచురల్ స్టార్ నాని సరసన ‘హాయ్ నాన్న’మూవీలో చేసి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత మృణాల్ విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ నటించింది. ఇది పెద్దగా హిట్ అందుకోలేక బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించింది.

ఇటీవల ‘కల్కి’లో కీలక పాత్రలో చేసిన ఆమె తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. అయితే ఇటీవల మృణాల్ ఓ పాపను ఎత్తుకొని ఉన్న పిక్ షేర్ చేసింది. దీంతో అది చూసిన వారంతా ‘పెళ్లి లేదు.. ప్రెగ్నెన్సీ లేదు.. బేబీ ఎక్కడ నుంచి వచ్చింది? అని కామెంట్లు పెట్టారు. తాజాగా, దీనిపై మృణాల్ రియాక్ట్ అవుతూ.. ‘‘పసి పిల్లలను ఎత్తుకొని ఆడించడం కూడా డేంజరే అని నాకు ఇప్పుడే తెలిసింది. ఇకనుంచి జాగ్రత్త పడతాను, ధన్యవాదాలు’’ అని తెలిపింది.


Similar News