Regina Cassandra: నాకు చాలా రిలేషన్‌షిప్స్ ఉన్నాయ్.. సీరియల్ డేటర్‌నంటూ రెజీనా షాకింగ్ కామెంట్స్! (వీడియో)

రెజీనా కసాండ్రా ‘పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

Update: 2024-09-13 09:37 GMT

దిశ, సినిమా: రెజీనా కసాండ్రా ‘పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసి అలరించింది. ప్రజెంట్ ఈ అమ్మడు ‘ఉత్సవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్జున్ సాయి దర్శకత్వం వహించిన ఈ మూవీలో దిలీప్ ప్రకాష్, రెజీనా జంటగా నటించారు. అయితే దీనిని హార్న్ బిల్ పిక్చర్స్ బ్యానర్‌పై సురేష్ పాటిల్ నిర్మించారు. సెప్టెంబర్ 13న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా తన రిలేషన్‌షిప్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను ఎవరి మాట వినను. ఏదైనా చేయాలంటే ఎందుకు చేయాలని ప్రశ్నిస్తాను. కొన్ని ప్లేస్‌లను బట్టి నేను కొందరిని మాత్రమే ఎందుకు అనే ప్రశ్నను అడగను. కొన్ని ప్రపోజల్స్ నా హార్ట్‌కి కనెక్ట్ అయ్యాయి. నా జీవితంలో నాకు చాలా రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. నేను ఒక సీరియల్ డేటర్‌ను అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ రెజీనాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు.


Similar News