ఆ నొప్పితో శారీరకంగా అలసిపోయిన సమయంలో అలా చేయడం కష్టంగా అనిపించింది: సాయి పల్లవి

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటించి మెప్పించి.. నటనతో మాత్రమే కాకుండా..

Update: 2024-03-16 04:57 GMT

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటించి మెప్పించి.. నటనతో మాత్రమే కాకుండా.. ఆమె డాన్స్‏కు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఇప్పటివరకు నటించిన అన్ని చిత్రాల్లో తన డాన్స్ తో మెస్మరైజ్ చేసింది. స్టార్ హీరోలు సైతం సాయి పల్లవితో డాన్స్ అంటే ఆలోచిస్తారు. అలాంటి ఈ అమ్మడుకి ఓ సినిమా సమయంలో డాన్స్ చేయడం అతి కష్టంగా అనిపించిందట. ఇంతకీ ఏంటా మూవీ అంటే న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఎప్పటిలాగే ఈ మూవీలో ట్రెడిషనల్ పాత్రలో మెప్పించిన సాయి పల్లవి క్లాసికల్ డాన్స్‌తో అదరగొట్టింది.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ‘ ‘శ్యామ్ సింగరాయ్’ మూవీకి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో చాలా కష్టపడ్డా. పీరియడ్స్ సమయంలో నాకు డాన్స్ చేయడం కష్టంగా అనిపించింది.. శారీరకంగా దెబ్బతిన్న.. 2, 3 రోజులు గంటల తరబడి షూటింగ్ చేయాల్సి వచ్చింది.. ఆ సమయంలో అలసిపోయినప్పుడు నా తండ్రి తన పాదాలకు మసాజ్ చేసేవారు’ అంటూ చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News