Jagapathi babu: అది లేని వాడినని దిగులు పడను.. కానీ మీరు చెబితే పడతాను.. జగపతి బాబు సంచలన పోస్ట్!

ఒకప్పటి స్టార్ హీరో జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకునే ఈయన అటు హీరోగా, ఇటు విలన్‌గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు.

Update: 2024-07-18 06:34 GMT
Jagapathi babu: అది లేని వాడినని దిగులు పడను.. కానీ మీరు చెబితే పడతాను.. జగపతి బాబు సంచలన పోస్ట్!
  • whatsapp icon

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరో జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకునే ఈయన అటు హీరోగా, ఇటు విలన్‌గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. జగపతి బాబు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్ని చోట్లా జగపతి బాబు సత్తా చాటుతున్నాడు. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ క్రమంలో గుంటూరు కారం మూవీలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు.

తాజాగా సోషల్ మీడియాలో జగపతి బాబు కొన్ని ఫొటోలు షేర్ చేశారు. అందులో క్యాసినో ఆడుతున్న బ్యాక్ గ్రౌండ్‌లో బ్లాక్ కలర్ ప్యాంటు, షర్ట్ వేసుకుని ఒక బ్యాగ్‌ను తగిలించుకుని ఫొటోకి స్టిల్ ఇచ్చాడు. అలాగే "సిగ్గు లేని వాడినని దిగులు పడను.. కానీ మీరు చెబితే పడతాను" అంటూ క్యాప్షన్ జోడించాడు. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారింది.

(photo link credits to jagapathi babu instagram id)

Tags:    

Similar News