గ్లామర్ పేరుతో శరీరాన్ని చూపించడం నాకు ఇష్టం లేదు: ప్రియా భవానీ శంకర్

కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ ‘మేయా దమాన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.

Update: 2024-10-06 09:16 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ ‘మేయా దమాన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అలాగే తెలుగులోనూ ఆమె ‘కళ్యాణం కమనీయం’ అనే మూవీతో ఆడియన్స్‌ను మైమరిపించింది. ప్రజెంట్ ప్రియా ‘బ్లాక్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జీవా హీరోగా నటించిన ఈ హారర్ మూవీ అక్టోబర్ 11న విడుదల కాబోతుంది. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రియా భవానీ శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘‘నా శరీరాన్ని నేను ఒక వస్తువుగా భావించను. ప్రేక్షకులను థియేటర్స్‌లోకి రప్పించడం కోసం గ్లామర్‌గా కనిపించడం నాకు నచ్చదు. అలాంటి వాటిని నేను అస్సలు అంగీకరించను. కెరీర్ పరంగా ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడకూడదనుకుంటా. అందుకు అనుగుణంగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా. నెగిటివ్ రోల్ చేయడానికి కూడా వెనకాడను. ఎందుకంటే అది నా వృత్తి కాబట్టి. ఒక హీరోయిన్‌గా ఫ్యాషన్ పేరుతో కొన్నింటిని ప్రమోట్ చేయలేను’’ అని చెప్పుకొచ్చింది.


Similar News