రజనీకాంత్ అలా చేసినందుకు చాలాసేపు ఏడ్చాను.. రంభ వైరల్ కామెంట్స్

ఒకప్పటి హీరోయిన్ రంభ అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది. కొద్ది కాలం పాటు పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.

Update: 2024-01-05 03:21 GMT

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ రంభ అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది. కొద్ది కాలం పాటు పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇక ఇటీవల పలు టీవీ షోస్‌లో పాల్గొంటూ అభిమానులకు దగ్గరవుతోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ స్టార్ హీరో రజనీకాంత్‌ తనను ఒకప్పుడు ఆటపట్టించి ఏడిపించారని ఆసక్తికర కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. రంభ మాట్లాడుతూ.. ‘‘అరుణాచలం సినిమా షూటింగ్ సమయంలో లైట్స్ ఆఫ్ అవడంతో వెనుక నుంచి నన్ను ఎవరో తట్టినట్టు అనిపించి భయపడి పోయాను. ఆ తర్వాత కరెంట్ వచ్చింది. దీంతో నన్ను ఎవరు టచ్ చేశారని అందరినీ అడిగాను. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ కావడంతో రజనీకాంత్ టవల్ విసిరికొట్టి నాతో ఆగ్రహంతో మాట్లాడారు. అప్పుడు నాకు ఏం అర్థం కాలేదు.

ఆ సమయంలో కెమెరామెన్ కలుగచేసుకుని ఏంటీ మేడం? ఇలా చేశారు.. ఇకపై మీతో నటించను అని రజినీసార్ అంటున్నారని ఆయన కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో నాకేం అర్థం కాక వెంటనే ఏడ్చేశాను. అప్పుడు రజనీ సార్ చూసి భయపడి నా దగ్గరకు వచ్చారు. నేనేం తప్పు చేశాను సార్ ఏం జరిగిందని అడిగాను. రజనీ సార్ అందరినీ పిలిచి ఉదయం సల్మాన్ రాగానే రంభ హగ్ చేసుకుంది.. ఇక్కడ మాత్రం ఎవరినైనా అలా కౌగిలించుకుందా అని అడిగారు. ఆ తర్వాత చేసి చూపించారు. తన బాలీవుడ్ సినిమా హీరో అయితే హగ్ చేసుకుని మరీ విష్ చేస్తుందని అందరి ముందు నన్ను ఆటపట్టించారు. వారు అలా చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నారని కాసేపటి తర్వాత నాకు అర్థం అయింది. ఈ విషయం తెలియక నేను చాలా సమయం పాటు ఏడ్చాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రంభ చేసిన వీడియోను నెట్టింట షేర్ చేసి వైరల్ చేస్తున్నారు.


Similar News