కాజల్ భర్తపై హైపర్ ఆది సెటైర్స్.. ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే నటి ఏం చేసిదంటే?

హైపర్ ఆది గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన పంచ్ డైలాగ్స్‌తో ఎంతో మందిని మాయ చేశారు. మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. జబర్దస్త్ స్కిట్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న ఆది ప్రస్తుతం స్టార్

Update: 2024-05-17 08:23 GMT

దిశ, సినిమా : హైపర్ ఆది గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన పంచ్ డైలాగ్స్‌తో ఎంతో మందిని మాయ చేశారు. మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. జబర్దస్త్ స్కిట్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న ఆది ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నాడు. అంతే కాకుండా ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో ఆయన టీమ్ లీడర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆ షోకి వచ్చే సెలబ్రిటీలపై పంచ్‌లు వేస్తూ అందరినీ నవ్విస్తుంటారు.

అయితే తాజాగా ఢీ కామెడీ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. కాగా, దీనికి ముఖ్య అతిథిగా కాజల్ వచ్చారు. దీంతో హైపర్ ఆది చేసిన పనులకు ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఆయన చేసిన సందడి మాములుగా లేదు. మగధీర సాంగ్‌తో షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మను హైపర్ ఆది ఇంప్రెస్ చేయడానికి తెగ కష్టపడ్డాడు. మీ పెల్లి రోజు అక్టోబర్ ముప్పై కదా.. ఆరోజు నాడెడ్ డే అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా పెళ్లికి ముందు మీ పై ఎన్నో కవితలు రాసుకున్నాను. అంటూ చెప్పగా.. కాజల్ మరి పెళ్లి తర్వాత అంటూ ప్రశ్నించింది. దీనికి హైపర్ ఆది సమాధానం ఇస్తూ.. కిచ్లూ బాధితుడిగా మారిపోయానంటూ చెప్తారు ఈ సందర్భం అక్కడున్నవారందరినీ నవ్వేలా చేస్తుంది. అంతే కాకుండా కాజల్ , హైపర్ ఆది మగ ధీర సినిమాలోని పంచదార బొమ్మ బొమ్మ అనే సాంగ్ పాడటం కూడా అందరినీ ఆకర్షిస్తుంది. ఇలా కాజల్ రాక, హైపర్ ఆది కామెడీ‌తో ఢీ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. 


Similar News