5 సంవత్సరాలుగా మందుకు బానిసైన Hyper Aadi.. కారణం ఆ అమ్మాయేనా?

తనదైన పంచులతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అంతే కాకుండా

Update: 2023-07-23 05:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : తనదైన పంచులతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అంతే కాకుండా ఢీ షోలో గత సీజన్‌ల నుంచి టీం లీడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ప్రసారమయ్యే ఢీ షో ప్రోమోలో మందు బాటిల్‌తో దర్శనం ఇచ్చిన హైపర్ ఆది, ఐదేళ్లుగా మద్యానికి బానిస అయ్యాను, అమ్మాయే కారణం అంటూ స్టేజ్‌పై నవ్వుల పంట పండించాడు. అసలు విషయంలోకి వెళ్లితే.. ఆదివారం ప్రసారం అయ్యే ఢీ షోకు సంబంధించిన ప్రోమోలో.. దీపిక పిల్లి అఖిల్ ని తీసుకొని స్టేజ్ పైకి రావడంతో ప్రదీప్ ఎవడీడు అని అడిగేసరికి, మా బావ అంటూ సమాధానం చెబుతుంది.

దీంతో శేఖర్ మాస్టర్ ఇంకొకరు ఏడి అంటూ ఆదిని ఉద్దేశించి అడగగా,వెంటనే స్టేజి పైకి హైపర్ ఆది మందు బాటిల్ చేతిలో పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు. ఇలా మందు బాటిల్ పట్టుకొని స్టేజ్ పైకి వస్తావా? అంటూ శేఖర్ మాస్టర్ అనడంతో నీ ప్రాబ్లం ఏంటి ? అంటూ ఆది అన్నారు దీంతో షాక్ అయిపోయారు శేఖర్ మాస్టర్.ఆది మాటలకు ఖంగుతిన్న శేఖర్ మాస్టర్ ఫస్ట్ టైం తాగినట్టున్నారు అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు. మొదటిసారి కాదు ఐదు సీజన్ల నుంచి తాగాల్సి వస్తుంది. ఆ అమ్మాయి కారణంగా అంటూ నవ్వులు కురిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Also Read: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరో శ్రీకాంత్?

Tags:    

Similar News