Honeymoon Express: భారీ రెస్పాన్స్ .. ఓటీటీలో అదరగొడుతున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ మూవీ

ఓటీటీలో అదరగొడుతున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ మూవీ

Update: 2024-09-08 02:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : చైతన్య రావ్, హెబ్బా పటేల్ కలిసి నటించిన మూవీ హనీమూన్ ఎక్స్‌ప్రెస్. చైతన్య రావ్ అందరి హీరోల్లాగా కాకుండా..  ఎప్పుడూ కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. చైతన్య రావ్ చేస్తున్న మూవీలన్ని అందర్ని ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ అయినా హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌కి థియేటర్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ జోడికి మంచి మార్కులే పడ్డాయి.

బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ సినిమాని కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అయింది. సిస్ట్లా వీఎంకే కెమెరాకి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాకి థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో.. ఓటీటీలో దానికి మించిన ఆదరణ వస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

అమెజాన్‌లో ఈ సినిమా ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా ఓటీటీ ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కొత్తగా పెళ్ళైన యువత ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్ట్ తో మన ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఓటీటీలో మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తూ భారీ రెస్పాన్స్ వస్తుంది.

Tags:    

Similar News