Rajinikanth: తలైవా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. డిలీటెడ్ సీన్స్‌తో ఓటీటీలోకి ‘లాల్ సలాం’
సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సలాం’.
దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సలాం’. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలో నటించగా.. ఇందులో రజినీకాంత్ గెస్ట్‌గా నటించాడు. అయితే ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 9న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. లాల్ సలాం మూవీ విడుదలై 7 నెలలు పూర్తి కావొస్తున్నప్పటికీ ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాలేదు. ఇదే విషయంపై తాజాగా, లాల్ సలాం తెరకెక్కించిన ఐశ్వర్య స్పందించి క్లారిటీ ఇచ్చింది.
‘‘లాల్ సలాం సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి మేము ఎంతో కష్టపడ్డాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఊహించిన విధంగా థియేటర్‌లో రిలీజ్ చేయలేకపోయాం. ఇందులోని ముఖ్యమైన సీన్స్ మిస్ కావడం వల్ల మా మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవల మాకు హార్డ్ డెస్క్ దొరికింది. ఆ మిస్ అయిన సన్నివేశాలు మళ్లీ యాడ్ చేస్తాము. థియేటర్ వెర్షన్ కాకుండా డైరెక్టర్ కట్ వెర్షన్‌తో ఓటీటీలోకి మా సినిమా రాబోతుంది. ఇందుకోసం రెహమాన్ వర్క్ చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న రజినీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లాల్ సలాం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.