Megastar Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డే నాడు బ్లాక్ బస్టర్ ‘ఇంద్ర’ మూవీ రీరిలీజ్ (పోస్ట్)

గత కొద్ది రోజుల నుంచి స్టార్ హీరోల సినిమాలన్నీ థియేటర్స్‌లో మళ్లీ రీరిలీజ్ అవుతూ ఊహించని విధంగా హిట్ అవుతున్నాయి.

Update: 2024-08-17 10:16 GMT

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి స్టార్ హీరోల సినిమాలన్నీ థియేటర్స్‌లో మళ్లీ రీరిలీజ్ అవుతూ ఊహించని విధంగా హిట్ అవుతున్నాయి. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయనడంతో అతిశయోక్తి లేదు. అయితే విడుదలైనప్పుడు కొన్ని పెద్దగా మెప్పించలేనప్పటికీ రీ రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. అలాగే మురారి సినిమా పలు రికార్డు సృష్టించింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాను కూడా వెనక్కి నెట్టిన విషయం తెలిసిందే. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ బారులు తీరుతూ మళ్లీ మళ్లీ మురారి సినిమా చూస్తున్నారు. దీంతో టికెట్లు కూడా లక్షల్లో అమ్ముడుపోతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఆల్ టైమ్ రికార్డ్ సాధించిన బ్లాక్ బస్టర్ ఇంద్ర సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు.

ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆగస్టు 22న తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2002లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కాగా ఇందులో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా.. ప్రకాష్ రాజ్, పునీత్ ఇస్సార్ కీలక పాత్రల్లో నటించారు.

Tags:    

Similar News