ప్రియురాలి బర్త్ డే.. గొప్ప పార్ట్నర్ దొరికిందంటూ హృతిక్ ఎమెషనల్ పోస్ట్
స్టార్ హీరో హృతిక్ రోషన్ తన ప్రియురాలు, నటి సబా ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ నోట్ షేర్ చేశాడు.
దిశ, సినిమా: స్టార్ హీరో హృతిక్ రోషన్ తన ప్రియురాలు, నటి సబా ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ నోట్ షేర్ చేశాడు. 2014లో సుసానే ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్న హృతిక్.. తరచుగా ఆమెతో పలు పార్టీలు, డిన్నర్ డేట్స్‌కు హాజరవుతున్నాడు. అంతేకాదు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుండగా బుధవారం సబా బర్త్ డే సందర్భంగా ప్రియురాలితో కలిసి దిగిన ఒక బ్యూటిఫుల్ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
ఇక ఈ పిక్‌లో ప్రేమికులిద్దరూ పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ ఫొటోకు పోజులివ్వడం విశేషం. కాగా ఈ పోస్ట్‌లో ‘మనమంతా ఒక ప్రదేశం కోసం వెతుక్కుంటాం. ఎక్కడైతే ఆప్యాయత, స్ఫూర్తి ఉండటంతోపాటు సురక్షితంగానూ అనిపించే తోడు ఉంటే చాలనుకుంటాం. ఇక జీవితం మన వైపు విసిరే సాహసాలను ఎదురుకోవడనికి సిద్ధమని చెప్పగలిగే ప్రదేశం మన ఇల్లు. అక్కడే మనకు సాహసాలు మొదలువుతాయి. రోజు చేసే పనులు కూడా అద్భుతంగా అనిపిస్తాయి. ఇది నేను నీ నుంచి నేర్చుకున్నాను సబా. నాతో ఉన్నందుకు థాంక్స్. మరిన్ని సాహసాలు చేద్దాం. హ్యాపీ బర్త్ డే మై లవ్’ అంటూ హృతిక్ తనదైన స్టైల్లో ప్రేయసికి విష్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.