రూ. 100 తో కెరీర్ ప్రారంభించిన హృతిక్ రోషన్.. ప్రస్తుతం ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?
చాలా మంది హీరోలు 50, 100 రూపాయలతో కెరీర్ ప్రారంభించి.. ప్రస్తుతం కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
దిశ, సినిమా: చాలా మంది హీరోలు 50, 100 రూపాయలతో కెరీర్ ప్రారంభించి.. ప్రస్తుతం కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే ఎంతో కష్టపడి.. సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని.. ఇప్పుడు నెంబర్ వన్ స్థాయిలో నిలబడ్డ హీరోల్లో హృతిక్ రోషన్ ఒకరు. ఈ హీరో 6 ఏళ్ల వయసులోనే తన సినీ కెరీర్ ప్రారంభించారు. మొదట ఆషాలో జితేందర్‌తో కలిసి డ్యాన్స్ నంబర్‌లో నటించే చాన్స్‌ను దక్కించుకున్నారు.
అప్పుడు హృతిక్ తీసుకున్న జీతం కేవలం 100 రూపాయలు. ఆ సమయంలో ఈ హీరో వయసు ఆరు సంవత్సరాలు మాత్రమే. ఇక ఆ తర్వాత ఆప్ కే దీవానే, ఆస్ పాస్, ఆస్రా ప్యార్ దా, భగవాన్ దాదా వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ ఫైటర్ మూవీలో నటిస్తున్నారు. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకు హృతిక్ ఏకంగా రూ. 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. 100 రూపాయలతో కెరీర్ స్టార్ట్ చేసిన హృతిక్ ఇప్పుడు కోట్లాధిపతి అవ్వడం అభిమానులకు సంతోషకరమైన విషయమంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.