Mathu Vadalara 2: హిట్ కొట్టిన ‘మత్తు వదలరా 2’ ఎంత కలెక్ట్ చేసిందంటే..?

హిట్ కొట్టిన ‘మత్తు వదలరా 2’ ఎంత కలెక్ట్ చేసిందంటే

Update: 2024-09-16 02:12 GMT

దిశ, వెబ్ డెస్క్ : 2019 లో వచ్చిన  ‘మత్తు వదలరా’  మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.  ఆ మూవీ తోనే సింహా కోడూరి  హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు  అయితే ఆ తర్వాత.. వచ్చిన సినిమాలన్నీ  ‘మత్తు వదలరా’ రేంజ్ సక్సెస్ అయితే అందుకోలేదు. రితేష్ రానా  దర్శకత్వంలో వచ్చిన  ఆ సినిమాలో  సత్య కామెడీ హైలెట్ గా నిలిచింది.  5 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’  మన ముందుకు వచ్చింది . సెప్టెంబర్ 13న ఆడియెన్స్  ముందుకు వచ్చిన ఈ మూవీ  మొదటి షోతోనే అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వస్తున్నాయి. ఒకసారి రెండు రోజులు  కలెక్షన్స్  చూసుకుంటే  గమనిస్తే.. 

నైజాం - 01.32 CR

సీడెడ్ - 0.39 CR

ఆంధ్ర(టోటల్) - 0.85 CR

ఏపీ + తెలంగాణ(టోటల్) - 02.56 CR

రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.35 CR

ఓవర్సీస్ - 01.90 CR

వరల్డ్ వైడ్(టోటల్) - 04.81 CR 

మత్తు వదలరా 2’ మూవీ  బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4 కోట్లు.  అయితే, రెండు రోజులకే ఈ మూవీ  రూ.4.81 కోట్లు షేర్ ని వసూలు చేసి   బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా…. రూ.0.81 కోట్ల ప్రాఫిట్స్ ను  కూడా  తెచ్చి పెట్టింది. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్  పెరిగాయి. ముఖ్యంగా ఆంధ్రాలో ఈ మూవీ  దూసుకెళ్తుంది. 

Tags:    

Similar News