ఈ స్టార్ కిడ్ ధరించిన సింపుల్ నగ ఎన్ని కోట్లో తెలిస్తే ఖంగుతినాల్సిందే..?
దివంగత నటి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: దివంగత నటి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. రీసెంట్ గా విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం దేవరతో ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే జాన్వీ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. తొలి సినిమానే ఏకంగా టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ సరసన చాన్స్ కొట్టేసి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. తల్లికి తగ్గ కూతురిగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం దేవర చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.
ఇకపోతే జాన్వీ కపూర్ అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ లో హాజరై సందడి చేసింది. ఎంతో మంది సెలబ్రిటీలు హాజరైనప్పటికీ జాన్వీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బ్యూటీ గోల్డ్ గౌరవ్ గుప్తా గౌన్ ధరించి.. అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. బల్గారీ బ్రాండ్ కు చెందిన లగ్జరీ అభరణాలు ధరించింది. ఈ పిక్స్ కు ‘గోల్డెన్’ అనే కాప్షన్ జోడించి తన అభిమానులతో పంచుకుంది. దీంతో ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. జాన్వీ మెడకు పెట్టుకున్న నెక్లెస్ ధర ఎంతంటూ బల్గారి అఫీషియల్ వెబ్సైట్లో వెతకడం ప్రారంభించారు. ధర చూడగా ఏకంగా చోకర్ నెక్లెస్ విలువ రూ. .8,00,00,000 ఉంది. దీంతో అభిమానులు నోరెళ్లబెడుతున్నారు.