Bigg Boss 8 : మరోసారి బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..

బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

Update: 2024-08-05 08:11 GMT

దిశ, సినిమా : బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ ఇంక ఏ షో కి కూడా లేదు. ఒక్కసారి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టాక అందరూ సమానమే. తెలుగు, హిందీ భాషలలో ఈ షోకు అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇప్పటివరకు విజయవంతంగా తెలుగులో 7 సీజన్స్ పూర్తి చేసుకుని.. సీజన్ 8 కోసం సిద్ధంగా ఉంది. దీనికి సంబందించిన ప్రోమో కూడా విడుదల చేసారు. ఈ ప్రోమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే, తెలిసిన సమాచారం ప్రకారం బిగ్‏బాస్ సీజన్ 8 లోకి నయని పావని కూడా వెళ్ళనుందని టాక్ బాగా నడుస్తుంది. గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి వెళ్లిన విషయం మనకి తెలిసిందే. కానీ, వెళ్లిన వారం రోజులకే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది.

ఇంట్లో అందరి కంటే మెరుగ్గా ఆడిన ఆకస్మాత్తుగా బయటకు రావడంతో నెటిజెన్స్ బిగ్ బాస్ మీద ఫైర్ అయ్యారు. అందరు కలిసి ఆమెను ఎలిమినేట్ చేశారంటూ ఒక రేంజ్లో మండిపడ్డారు. ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ అప్పట్లో బాగా పోస్టులు పెట్టారు. అయితే, ఇప్పుడు సీజన్ 8లోకి ఇంకోసారి పంపించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిలో ఎంత నిజముందో తెలియాలి అంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.  

Tags:    

Similar News