ఇరవై రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

టాలీవుడ్ యంగ్ హీరో ధృవ వాయు ‘కిరోసిన్’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన మూవీ హారర్ థ్రిల్లర్ ‘కళింగ’.

Update: 2024-09-28 11:16 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ధృవ వాయు ‘కిరోసిన్’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన మూవీ హారర్ థ్రిల్లర్ ‘కళింగ’. ఈ సినిమాలో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశాడు. అయితే ఇందులో ప్రగ్యా నయన్ హీరోయిన్‌గా నటించగా.. మీసాల లక్ష్మణ్ ఆడుకాలం నరేన్, సుధాకర్ కీలక పాత్రలో కనిపించారు.

హారర్ ఎలిమెంట్స్‌తో సెప్టెంబర్ 13న విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. తాజాగా, ‘కళింగ’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అయితే అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.


Similar News