వరుణ్ దేవ్‌ను టెంపుల్‌లో పెళ్లి చేసుకుని సడన్ ట్విస్టిచ్చిన హీరోయిన్.... నెట్టింట వైరలవుతోన్న పిక్స్

మలయాళీ బ్యూటీ శ్రీ గోపిక తాజాగా వివాహం చేసుకుని అభిమానులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

Update: 2024-10-08 05:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: మలయాళీ బ్యూటీ శ్రీ గోపిక తాజాగా వివాహం చేసుకుని అభిమానులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ అమ్మడు వూల్ఫ్,నాన్సెన్స్, 90ML వంటి మలయాళ తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ శ్రీగోపిక యాక్టింగ్‌ యువత ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. తన నటన, అందం, అభినయంతో తమిళ, మలయాళ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ అమ్మడు కొన్నాళ్లు బుల్లితెరపై కూడా మెరిసింది. అయితే ఈ హీరోయిన్ కు గతంలో ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయ్యింది. కానీ కొన్నాళ్ల అనంతరం ఏమైందో తెలియదు కానీ.. వీరి ఎంగేజ్ మెంట్ రద్దు అయ్యింది.

తాజాగా శ్రీగోపిక ఫ్యాన్స్ కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. చడిచప్పుడు లేకుండా గుళ్లో పెళ్లిచేసుకుని ట్విస్ట్ ఇచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ బ్యూటీ కేరళ గురువాయూర్ దేవాలయంలో వరుణ్ దేవ్‌ను సింపుల్ గా పెళ్లి చేసుకుంది. తాజాగా ఈ భామ పెళ్లి పిక్స్ సోషల్ మీడియాలో పంచుకోగా.. అభిమానులు ఆశ్చర్యపోతూనే పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం శ్రీగోపిక్-వరుణ్ దేవ్ వివాహం పిక్స్ నెట్టిట వైరల్ అవుతున్నాయి.


Similar News