ఆమెతో లవ్.. బ్రేకప్.. విడాకులపై స్టార్ నటి స్నేహ షాకింగ్ కామెంట్స్..!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ప్రియమైన నీకు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. స్కిన్ షో కు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ.. ఎక్కువ ఫ్యామిలీ సినిమాలు చేస్తూ ఎంతో మంది క్రేజ్ తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ చేసి పలు సినిమాల్లో అలరిస్తుంది. సినిమాల్లోనే కాకుండా భర్తతో కలిసి పలు యాడ్స్ సైతం చేస్తుంది స్నేహ. ఇదిలా ఉంటే.. తన భర్త లవ్, అతనితో విడాకులపై తాజాగా స్పందించింది హోమ్లీ బ్యూటీ.
తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించిన ఈ బ్యూటీ.. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో నటుడు ప్రసన్న కుమార్‌ని ప్రేమ పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నట్లు, విడాకులు తీసుకుంటున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహ వీటిపై స్పందించిన విషయం తెలిసిందే.
‘నాతో పెళ్లికి ముందే నా భర్త వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. ఆ అమ్మాయి, నా భర్త చాలా గాఢంగా ప్రేమించుకున్నారట. కానీ ఏమైందో తెలియదు విడిపోయారు. వీళ్ల బ్రేకప్ తర్వాత ప్రసన్నతో నేను ప్రేమలో పడ్డాను.. పెళ్లి చేసుకున్నాను. ఆమెకు బ్రేకప్ చెప్పడం వల్లే నాకు ప్రసన్న కుమార్ దొరికారు’ అంటూ తనతో పెళ్లికి ముందు భర్త లవ్ గురించి ఓపెన్ అయింది స్నేహ. అంతే కాకుండా.. మేము ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉంటాము. మేము దూరంగా లేము, విడాకులు కూడా తీసుకోవడం లేదు. ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మద్దొ అంటూ.. వీరి విడాకులపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను సైతం కొట్టిపడేసింది స్నేహ. ప్రస్తుతం ఈ హోమ్లీ బ్యూటీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read More...
ఆ భాషలో మాట్లాడినందుకు నన్ను శారీరకంగా వేధించారు.. నటి ఎమోషనల్ పోస్ట్