బ్రెస్ట్ సైజు పెంచడానికి సర్జరీ చేయించుకోవాలనుకున్నా.. అందుకోసం ప్యాడ్స్ వాడాను: స్టార్ హీరోయిన్
మోడలింగ్‌గా కెరీర్ ప్రారంభించిన హీరోయిన్ సమీరా రెడ్డి హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది
దిశ, సినిమా: మోడలింగ్‌గా కెరీర్ ప్రారంభించిన హీరోయిన్ సమీరా రెడ్డి హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు చిత్రంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘జై చిరంజీవ’ సినిమాలో అవకాశం కొట్టేసింది.
ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక మూడో మూవీ తారక్‌తో కలిసి నటించగా.. వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందంటూ అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఎన్టీఆర్-సమీరా పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున నెట్టింట వార్తలు వినిపించాయి. కానీ 2014 లో సమీరా పెళ్లి చేసుకుని నటనకు గుడ్ బై చెప్పింది. తాజాగా ఈ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. తనకు ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చింది.
‘‘బాడీ షేమింగ్ గురయ్యాను. బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉందని నెగిటివ్ కామెంట్స్ చేశారు. సైజ్ పెరిగెందుకు సర్జరీ చేయించుకోమని సలహా కూడా ఇచ్చారు. ఈ కామెంట్స్ నాపై ఒత్తిడికి కారణమయ్యాయి. దీంతో సర్జరీ చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాను. కానీ చేయించుకోలేదు. బ్రెస్ట్ సైడ్ పెద్దదిగా కనిపించేందుకు ప్యాడ్స్ ఉపయోగించేదాన్ని. సర్జరీ వల్ల పలు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని ఆలోచించి.. సర్జరీ చేయించుకోలేదు’’. అంటూ సమీరా రెడ్డి ఇంటర్వ్యూలో వెల్లడించింది.