రోజా నల్లగా ఉండేది కాబట్టి పనిమనిషి పాత్రలు చేసేది.. సంచలనం సృష్టిస్తున్న నటి కామెంట్స్!

టాలీవుడ్ నటి మాధవి సుపరిచితమే. ఆమె పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. ఎక్కువగా తల్లి పాత్రల్లోనే నటించి అందరి హృదయాలను గెలుచుకుంది.

Update: 2024-03-20 09:09 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ నటి మాధవి సుపరిచితమే. ఆమె పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. ఎక్కువగా తల్లి పాత్రల్లోనే నటించి అందరి హృదయాలను గెలుచుకుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవి ఒకప్పటి హీరోయిన్ రోజాకు తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ ఇప్పుడు మంత్రిగా ఉన్న నటి రోజా నేను నా క్లాస్ మెట్. డిగ్రీ చేసేటప్పుడు ఒకే కాలేజ్‌లో చదువుకున్నాము. రోజా స్టడీస్‌లో ఫస్ట్ ఉండేది. చాలా తెలివిగా స్పాంటేనియస్‌గా ఉండేది. 1991లో రోజా ‘ప్రేమ తపస్సు’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి వచ్చింది.

అయితే ఈ మూవీ షూటింగ్‌కు మా ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్లాము. అందులో ఆమె పని మనిషి పాత్రలో నటించింది. అది ఆమెకు సెట్ అయిందని చెప్పాను. అంతేకాకుండా నల్లగా ఉంటావని మా ఫ్రెండ్స్ అందరం ఆమెను ఎగతాళి చేసేవాళ్లం. ఆ తర్వాత మళ్లీ రోజాను మోడ్రన్ మహాలక్ష్మి షో అప్పుడు కలిశాను కానీ ఆమె నన్ను గుర్తు పట్టకపోవడంతో దూరంగా ఉండిపోయాను. ఆ తర్వాత తమిళ సినిమాల్లో నటించి ఫేమ్ పెంచుకుంది. అంతేకాకుండా ఇప్పుడు రాజకీయాల్లో రాణించగలుగుతుందంటే.. అందుకు ఆమె ధైర్యమే కారణం. అది లేకుంటే రాజకీయాల్లో నెగ్గడం కష్టం’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాధవి కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారాయి.


Similar News