Praneetha : చిరునవ్వులు చిందిస్తున్న కాబోయే తల్లి ప్రణీత.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్!

అందాల ముద్దుగుమ్మ ప్రణీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సిద్ధార్థ్ హీరోగా వచ్చిన బావ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతో

Update: 2024-07-30 14:39 GMT

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ ప్రణీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సిద్ధార్థ్ హీరోగా వచ్చిన బావ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా కనిపించి, అమ్మో బాపుగారి బొమ్మో అంటూ అందరి హృదయాలను దోచేసుకుంది. ఇక బ్యూటీ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఏడు అడుగులు వేసి, వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ఇక వీరి ప్రేమకు గుర్తుగా వీరికి 2022లో బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నాను అంటూ ఇటీవలే ప్రకటించింది.

కాగా, తాజాగా మరోసారి తల్లి కాబోయే ఈ బ్యూటీ ఎల్లో కలర్ డ్రెస్‌లో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ ముద్దుగుమ్మ ఎల్లో కలర్ ట్రెండీ డ్రెస్‌లో చిరు నవ్వులు చిందిస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ చాలా అందంగా కనిపిస్తుంది. దీంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News