పెళ్లి పెటాకులు లేక కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నావ్.. హీరోయిన్ పోస్ట్ వైరల్
మాధవీలత. ఈ పేరు వినే ఉంటారు. ‘నచ్చావులే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తెలుగింటి అమ్మాయిగా మొదటి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: మాధవీలత. ఈ పేరు వినే ఉంటారు. ‘నచ్చావులే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తెలుగింటి అమ్మాయిగా మొదటి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక తర్వాత పలు సినిమాల్లో నటించిన మెప్పించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం హాట్ హాట్‌గా వైరల్ అవుతుంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మాధవీలత.. ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ట్రోల్స్‌కు గురవుతుంటుంటి. అయితే.. తన మీద ఎన్ని ట్రోల్స్, విమర్శలు వచ్చిన వాటికి తనదైన స్టైల్లో రిప్లైలు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ.
గత కొన్ని రోజులకుగా మాధవీలత పెళ్లి టాపిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ఏ వీడియో పెట్టిన అందరూ తన పెళ్లి గురించి చర్చించడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మరింత తెగించి మాధవీలతకు కోపం వచ్చేలా కామెంట్ పెట్టడంతో దానిపై స్పందించిన అమ్మడు.. ‘‘పెళ్లి పెటాకులు లేక కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నావ్ అంటున్నాడు.. అందుకే వాడికి సమాధానం చెప్తున్నా’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. మాధవీలత షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.