నాని ‘సరిపోదా శనివారం’ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. నెటిజన్లు ఫిదా

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘సరిపోదా శనివారం’.

Update: 2024-07-07 12:04 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘సరిపోదా శనివారం’. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే అంటే సుందరానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ మూవీ చేస్తుండటంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇందులో ప్రియాంకా అరుల్ మోహన్, నాని సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరికి ఇది రెండో సినిమా అని చెప్పవచ్చు. ఇంతకు ముందు నానీస్ గ్యాంగ్ లీడర్ చిత్రంలో జంటగా నటించి మెప్పించారు.

ఇదిలా ఉంటే.. సరిపోదా శనివారం డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీత దర్శకుడిగా చేస్తున్నాడు. అయితే ఇటీవల ఈ మూవీ నుంచి నాని లుక్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్‌కు దక్కించుకుంది. తాజాగా, సరిపోదా శనివారం నుంచి హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో పోలీస్ డ్రెస్ ధరించి సింపుల్‌గా కనిపించింది. ఈ అమ్మడు చారులత క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజెంట్ ప్రియాంక లుక్స్ అందరినీ ఫిదా చేస్తున్నాయి.

 


Similar News