Hero Surya: షూటింగ్‏లో గాయపడిన హీరో సూర్య.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

షూటింగ్‏లో గాయపడిన హీరో సూర్య

Update: 2024-08-10 02:20 GMT

దిశ, సినిమా : హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువతకి మెచ్చే సినిమాలను తీస్తూ కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న విషయం మనకీ తెలిసిందే.

ఈ మూవీ సూర్య 44 టైటిల్ తో రూపొందుతుంది. సూర్య పుట్టిన రోజు నాడే ఇటీవలే గ్లింప్స్ ను విడుదల చేసారు. చూడబోతుంటే ఇది పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే షూటింగ్లో సూర్య తలకు పెద్ద గాయమైందంటూ నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో సూర్య అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

తాజాగా ఈ ఘటనపై నిర్మాత రాజశేఖరన్ పాండియన్ స్పందించారు. సూర్యకు పెద్ద గాయం కాదు స్వల్ప గాయాలు మాత్రమే అని తెలిపారు. సూర్య కోలుకుంటున్నారు.. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. అక్కడ గాయపడగా .. సూర్యను వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం చేయించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో సూర్యకి జోడిగా పూజా నటిస్తుంది.

Tags:    

Similar News