ఆసక్తి రేపుతున్న ‘హలో.. మీరా’.. ఒకే ఒక్క పాత్రతో టెన్షన్ టెన్షన్

సినిమా అంటే ఎన్నో పాత్రలు.. మరెన్నో సన్నివేశాలు, ఎమోషన్స్ ఉంటాయి.

Update: 2023-04-17 08:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినిమా అంటే ఎన్నో పాత్రలు.. మరెన్నో సన్నివేశాలు, ఎమోషన్స్ ఉంటాయి. కానీ, ఒకే ఒక్క పాత్రతో సినిమా తీయడం సాధ్యమేనా..? ఒక పాత్రతో ప్రేక్షకుడికి కావాల్సిన ఎమోషన్స్ పండించడం సాధ్యం అవుతుందా..? అంటే ‘హలో.. మీరా’ ట్రైలర్ చూశాక అవునని చెప్పక తప్పదు. ఎందుకంటే తెరపైన కేవలం ఒక అమ్మాయి పాత్రను చూపించి.. ఎన్నో ఎమోషన్స్ పండించి, ప్రేక్షకుడి మైండ్‌లో ఎన్నో రోల్స్ మెదిలేలా ఈ సినిమాను తెరకెక్కించడం సాధారణ విషయం కాదు. ఈ అద్భుతాన్ని సృష్టించింది ఎవరో కాదు.. డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్.

గార్గేయి ఎల్లాప్రగడ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘హలో.. మీరా’. కేవలం ఒకే ఒక్క పాత్రతో క్షణం క్షణం టెన్షన్ పెట్టించే ఈ చిత్రానికి శ్రీనివాస్ కాకర్ల దర్శకత్వం వహించారు. ల్యూమిరే సినిమా బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్ చిన్నా సంగీతం అందిస్తున్నారు. కాగా.. ‘హలో మీరా’ ఈ నెల 21 న థియేటర్లలో సందడి చేయనుంది.

Tags:    

Similar News