బికినీ ధరించలేదని తిట్టాడు.. ఆ మాటలు ఇప్పటికీ మర్చిపోలేదంటూ స్టార్ హీరోయిన్ కామెంట్స్!

మనీషా కోయిరాలా ‘బొంబాయి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకుంది.

Update: 2024-07-09 08:56 GMT

దిశ, సినిమా: మనీషా కోయిరాలా ‘బొంబాయి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకుంది. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న క్రమంలో క్యాన్సర్ రావడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల మళ్లీ సంజయ్ లిలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్‌తో మనీషా కోయిరాలా సినీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ తొందరలో రెండో సీజన్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ క్రమంలో.. మనీషా కోయిరాలా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన జీవితంలో జరిగిన అనుభవాలను పంచుకుంటుంది.

తాజాగా, తనను బికిని ధరించనందుకు ఓ వ్యక్తి తిట్టాడని చెప్తూ.. మనీషా కోయిరాలా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ ఇన్సిడెంట్‌ను నేను ఇప్పటికీ మర్చిపోలేదు. మొదట్లో కొందరు ఫొటోషూట్ చేస్తామని అడిగారు. దీంతో నేను ఓకే చెప్పాను. అయితే ఓ ఫొటోగ్రాఫర్ నేను పెద్ద సూపర్ స్టార్ అవుతానని చెప్పి పొగిడాడు. ఆ తర్వాత టూ పీస్ బికినీ తీసుకొచ్చి వేసుకోమని చెప్పాడు. కానీ నేను అంగీకరించలేదు. ఆ డ్రెస్ నేను స్విమ్మింగ్ చేసే సమయంలోనే వేసుకుంటానని నిర్మొహమాటంగా చెప్పాను.

దీంతో నా మీద ఆయనకు కోపం వచ్చి తిట్టి అక్కడ నుంచి వెళ్లి పోతూ.. కరగడానికి కూడా నిరాకరించే మట్టిముద్ద నుంచి ఎవరూ బొమ్మను తయారు చేయలేరనే డైలాగ్ వెళ్లిపోయాడు. అప్పుడే అర్థం అయింది అందరూ ఒకేలా ఉండరని. కానీ అతని మాటలను నేను ఇప్పటికీ మర్చిపోలేదు. అయితే నేను స్టార్ హీరోయిన్ అయ్యాక నన్ను తిట్టిన ఫొటోగ్రాఫరే వచ్చి ఫొటోషూట్ చేశాడు. అతను నన్ను చూసి చాలా సంతోషపడ్డాడు. ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు మనకంటూ ఓ సమయం వస్తుంది. అప్పుడే మనమేంటో నిరూపించుకోవాలి అంతే’’ అని చెప్పుకొచ్చింది.


Similar News