‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో పొలిటికల్ పంచులపై స్పందించిన హరీష్ శంకర్.. మూడిందన్నట్టుగా ట్వీట్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల నటించిన ‘బ్రో’ చిత్రం థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Update: 2023-08-07 09:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల నటించిన ‘బ్రో’ చిత్రం థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డు టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పాత్ర, ఆ క్యారెక్టర్ వేసిన స్టెప్పుల మీద మంత్రి అంబటి రాంబాబు మాట్లాడాడు. తన మీద ఇలాంటివి ఇంకోసారి చేస్తే బాగుండదని చిత్ర పరిశ్రమకు వార్నింగ్ కూడా ఇచ్చారు.

మళ్లీ రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయితే బ్రో సినిమాలో చూపించిన దానికి ఇలా అయిపోతే మునుముందు ఇంకా మరింతగా ఉండబోతోందనే టాక్ వస్తోంది. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ‘బ్రో’ మూవీని మించి రాజకీయ నాయకుడు, పోలీసోడి మధ్య కథ ఉంటే సెటైర్లు వేసేలా ఉంటుందని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఉంటుందని కొద్దిరోజులుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

తాజాగా, ఈ విషయంపై డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. అవును ఉస్తాద్‌లో లెక్కకు మించి ఏపీ ప్రభుత్వానికి మూడిందన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఐకానిక్ మ్యానరిజాన్ని షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News