Hardik Pandya: నటాషాతో విడాకులు.. ఆ స్టార్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. వైరల్ అవుతున్న పోస్ట్

మోడల్ కమ్ నటి అయిన నటాషా, క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటివలే విడాకులు తీసుకున్నట్లు ఇన్‌స్టా గ్రామ్ పోస్ట్ ద్వారా ధృవీకరించిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-14 06:24 GMT
Hardik Pandya: నటాషాతో విడాకులు.. ఆ స్టార్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. వైరల్ అవుతున్న పోస్ట్
  • whatsapp icon

దిశ, సినిమా: మోడల్ కమ్ నటి అయిన నటాషా, క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటివలే విడాకులు తీసుకున్నట్లు ఇన్‌స్టా గ్రామ్ పోస్ట్ ద్వారా ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఇక వారిద్దరికీ అగస్త్య అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే విడాకుల తర్వాత నటాషా తన కొడుకుతో తన సొంత దేశం అయిన సెర్బియాకు వెళ్ళిపోయి అక్కడ కుమారునితో ఎంజాయ్ చేస్తుంది. ఇక హార్దిక్ పాండ్యా మాత్రం.. క్రికెట్ నుండి విరామం దొరకడంతో గ్రీస్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తాజాగా అక్కడ హార్ధిక్‌ స్విమ్మింగ్ పూల్ ముందు నిలబడి ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో హార్దిక్ డేటింగ్ రూమర్స్ మరోసారి హల్‌చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

హార్దిక్ వీడియో పోస్ట్ చేయడానికి రెండు రోజుల ముందు.. బ్రిటీష్ స్టార్ సింగర్ అయిన జాస్మిన్ వాలియా గ్రీస్‌లో తన హలిడే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిలో.. ఆమె సరిగ్గా అదే స్విమ్మింగ్ పూల్ ముందు నిలబడి కనిపించింది. ఇద్దరి బ్యాక్ గ్రౌండ్ మ్యాచింగ్ కావడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాకుండా జాస్మిన్ కూడా హార్దిక్ వీడియోను లైక్ చేయడం.. వీరిద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టా ఫాలో అవ్వడంతో ఇవన్నీ చూస్తూంటే నిజంగానే ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారనే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించే వరకు ఆగాల్సిందే.

(video link credits to hardik pandya instagram id)

(video link credits to jasmin walia instagram id)

Tags:    

Similar News